స్పీడ్ పెంచిన శివాని, ఎమ్మెల్యేతో సినిమా

జీవిత డా.రాజశేఖర్ ల చిన్న కూతరు శివాత్మిక దొరసాని సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి మంచి బ్రేక్ తెచ్చుకుంది. పెద్దమ్మాయి శివానీ కూడా కేవీ గుహన్ డైరెక్ట్ చేస్తున్న సెకండ్ మూవీ wwwలో యాక్ట్ చేస్తుంది. తెలుగు తమిళ మార్కెట్ పై ఒకేసారి ద్రుష్టిపెట్టిన శివాని, కోలీవుడ్ లో ఇప్పటికే హిప్ హాఫ్ తమిళతోటి అన్బారివు సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ విడుదల కాకముందే శివాని రాజశేఖర్ మరో క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసింది.

తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, యంగ్ ఎమ్మెల్యే ఉదయ నిధి స్టాలిన్ తో శివాని నెక్స్ట్ మూవీ ఉండబోతుందట. నిజానికి ఈ సినిమా స్టార్ట్ చాలా రోజుల క్రితమే స్టార్ట్ కావల్సి ఉండగా… ఎన్నికలు, కరోనా… ఇలా రకరకాల కారణాల చేత డిలే అయ్యింది. తెలుగు తమిళ భాషల్లో రూపొందనున్న ఈ మూవీలో శివాని క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోందట. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శివాని, ఈ సినిమాతో కోలీవుడ్ మార్కెట్ పై కన్నేస్తే… ఉదయ నిధి స్టాలిన్ తెలుగు మార్కెట్ ని టార్గెట్ చేశాడు.