ఓటీటీలో కూడా కోట్లు కొల్లగొట్టిన భాయ్…

సల్మాన్ ఖాన్, కింగ్ అఫ్ బాలీవుడ్ బాక్సాఫీస్. భాయ్ సినిమా వస్తుంది అంటే బాక్సాఫీస్ దెగ్గర వసూళ్ల వర్షం కురవాల్సిందే. ఇక ఈద్ ఫెస్టివల్ కి సల్మాన్ సినిమా అంటే ఆ కలెక్షన్స్ ఏ రేంజులో ఉంటాయో పాత చిత్రాల లెక్కలు తిరగేస్తే అర్ధమయిపోయింది. ఈద్ కి సల్మాన్ సినిమాకి ఉన్న మ్యాజిక్ అలాంటిది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్స్ బంద్ ఉన్నాయి అందుకే భాయి మూవీ థియేటర్ లో కాకుండా జీ5 యాప్ లో స్ట్రీమ్ అయ్యింది. దాదాపు 230 కోట్లు ఆఫర్ చేసిన జీ5 రాధే సినిమా స్ట్రీమింగ్ రైట్స్ కొనుక్కున్నారు. పే పర్ వ్యూ బేసిస్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ షోకే నెగటివ్ టాక్ తెచ్చుకుంది. రొటీన్ మాస్ డ్రామాగా కామెంట్స్ పొందిన రాధే, కలెక్షన్స్ విషయంలో మాత్రం భాయ్ స్టామినా ఏంటో చూపిస్తోంది.

జీ5 రాధే సినిమాకి ఒక్క వ్యూకి 249 రూపాయలు ఛార్జ్ చేశారు. 24 గంటల్లో ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4.2+ మిలియన్ వ్యూవ్స్ వచ్చాయని అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు. ఈ రేంజ్ స్ట్రీమింగ్ జరగడం అనేది ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే 4.2 మిలియన్ వ్యూస్ కి, 249 రూపాయల చొప్పున లెక్కేస్తే… రాధే సినిమా మొదటిరోజు దాదాపు 100కోట్లకి పైనే వసూళ్లు రాబట్టింది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఇది రికార్డు, దీంతో థియేటర్ అయినా సరే ఆన్లైన్ స్ట్రీమింగ్ అయినా సరే మొదటిరోజు 100కోట్ల మార్క్ టచ్ చేయడం అనేది సల్మాన్ ఖాన్ కి పెద్ద కష్టమేమి కాదని తేల్చేశాడు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది కానీ నెగటివ్ కామెంట్స్, ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న రాధే, జీ5 వాళ్ళని సేవ్ చేయాలి అంటే ఇంకో 150 కోట్లు రాబట్టాలి. ఈ టాక్ తో కూడా అంతమొత్తం రాబట్టగలిగితే భాయ్ నిజంగా బాక్సాఫీస్ బాద్షానే.