ట్రెడిషన్ ఫాలో అవుతూ ‘కౌబాయ్’గా మహేశ్‌ మేనల్లుడు

జేమ్స్ బాండ్, కౌబాయ్ సినిమాలకి తెలుగులో మార్కెట్ తెచ్చిన హీరో సూపర్‌స్టార్‌ కృష్ణ. ఆ తర్వాత అదే ట్రెండ్ ఫాలో అవుతూ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా కౌబాయ్ గా నటించాడు. ముఖ్యంగా టక్కరి దొంగ మూవీలో మహేశ్ స్క్రీన్ ప్రెజెన్స్ హాలీవుడ్ హీరోని గుర్తు చేసేలా ఉంటుంది. కౌబాయ్ సినిమాలు అంటే గట్టమనేని హీరోలే చేయలి అనే అంతగా పేరు తెచ్చుకున్నారు. ఈ ట్రెండ్ ని ఫాలో అవుతూ గుంటూరు జిల్లా ఏంపీ జయదేవ్‌ గల్లా తనయుడు అశోక్‌ గల్లా కూడా కౌబాయ్ గా కనిపించబోతున్నాడు. దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అమర రాజ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు.

డిఫరెంట్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అశోక్‌ గల్లా సరసన హీరోయిన్‌గా నిధీ అగర్వాల్‌ నటిస్తోంది. జగపతిబాబు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నరేష్, సత్య, అర్చన సౌందర్య కీలక పాత్రధారులు. ఈ సినిమా టైటిల్‌ టీజర్‌ను ఈ నెల 23న విడుదల చేయనున్నట్లు ఓ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు చిత్రయూనిట్‌. అశోక్‌ గల్లా గుర్రపు స్వారీ చేస్తున్నట్లుగా ఈ పోస్టర్‌లో కనిపిస్తుంటుంది. జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రిచర్డ్‌ ప్రసాద్‌ ఛాయగ్రాహకులుగా పనిచేస్తున్నారు.