ఇతను 90ల్లో అర్జున్ రెడ్డిరా మాధాపూర్…

అర్జున్ రెడ్డి… పస్త డికేడ్ లో ఈ మూవీ ఒక సెన్సేషన్. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాని సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేశాడు. ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన అర్జున్ రెడ్డిని యూత్ బాగా ఓన్ చేసుకున్నారు. యాంగర్ ఇష్యూస్ ఉన్న హీరోకి, అగ్రెసివ్ హీరోకి యూత్ సూపర్ గా కనెక్ట్ అయ్యారు. అర్జున్ రెడ్డి సినిమాకే కాదు సాంగ్స్ ట్రైలర్ తీజర్ పోస్టర్ ఇలా ప్రతి విషయానికి కనెక్ట్ అయిన ఆడియన్స్ మూవీని సూపర్ హిట్ చేశారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ పవన్ ఓల్డ్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇందులో పవన్ చాలా స్టైలిష్ గా వింటేజ్ లుక్ తో కనిపించడంతో పవన్ అభిమానులు ఆ పిక్ ను సోషల్ మీడియాలో వీర లెవల్ లో వైరల్ చేస్తున్నారు. ఈ ఫోటో నిన్నటి నుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 90లలో అర్జున్ రెడ్డి లా ఉన్న పవన్ కల్యాణ్ అన్-సీన్ పిక్ అంటూ హల్చల్ చేస్తున్న ఈ పిక్ చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. బద్రి, ఖుషి సినిమాల్లో ఉండే పవన్ స్వాగ్ ఏ వేరు. అప్పటిలో పవన్ ఎలా ఉండే వాడో, అతని స్టైల్ స్వాగ్ ఎలా ఉండేదో చెప్పడానికి ఈ ఒక్క పిక్ చాలు. అర్జున్ రెడ్డిలో ఉండే ఫైర్ పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలో ఉండేది అందుకే… పవర్ స్టార్ నిజంగానే 90’s అర్జున్ రెడ్డి.

ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్ ను వాయిదా వేశారు.అయితే పవన్ ఈ సినిమా తో పాటు “అయ్యప్పనుమ్ కోషియం” అనే రీమేక్ సినిమాలో కూడా నటిస్తున్నారు.ఈ సినిమాలో పవన్ తో పాటు రానా కూడా ప్రధాన నటిస్తున్నాడు.