ఇంటెలిజెన్స్ ఆఫీసర్ రాజా విక్రమార్క

యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీతో వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కార్తికేయ 7వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ‘రాజావిక్రమార్క’ టైటిల్ ఖరారు చేశారు. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ వంగ రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా నిర్మాత 88 రామారెడ్డి మాట్లాడుతూ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన ప్రముఖ దర్శకులు సందీప్ రెడ్డి వంగా గారికి మా కృతజ్ఞతలు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో కార్తికేయ నటన, పాత్ర చిత్రణ కొత్తగా ఉంటుందట. టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌కు ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన లభిస్తోంది. కార్తికేయ లుక్ కూడా చాలా బాగుంది. ప్రేక్షకులను అలరించే సినిమాగా రూపొందుతున్న ఈ మూవీ చిత్రీకరణ చాలా వరకూ పూర్తయింది. లాక్‌డౌన్ ఎత్తేయడంతో బాలన్స్ షూటింగ్ పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

దర్శకుడు శ్రీ సరిపల్లి మాట్లాడుతూ సినిమాలో కొత్తగా ఎన్.ఐ.ఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ఏజెన్సీ)లో జాయిన్ అయిన అధికారిగా హీరో కార్తికేయ కనిపిస్తారు. ఈ పాత్రలో ఆయన ఒదిగిపోయి నటించారు. యాక్షన్ సన్నివేశాలను స్పెషల్ గా డిజైన్ చేశాం. అవి ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తాయి. సీనియర్ తమిళ నటులు రవిచంద్రన్ గారి మనవరాలు తాన్యా రవిచంద్రన్ ఈ సినిమాతో తెలుగు పరిశ్రమలో హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాం. హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు క్యూట్ గా ఉంటాయి. యువ సంగీత దర్శకుడు ప్రశాంత్ఆర్. విహారి మంచి బాణీలు అందించారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం అని అన్నారు.