రాములో రాములా పాటకి ఈ పాప డాన్స్ అదరగొట్టింది…

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ వచ్చిన ఇండస్ట్రీ హిట్ మూవీ అల వైకుంఠపురములో… ఈ సంక్రాంతి ప్రేక్షకుల ముందుకి వచ్చిన అల వైకుంఠపురములో నాన్ బాహుబలి రికార్డ్స్ అన్నీ క్లియర్ చేసి కొత్త బాక్సాఫీస్ హిస్టరీ క్రియేట్ చేసింది. అల వైకుంఠపురములో సినిమా ఎంత హిట్ అయ్యిందో, అందులోని సాంగ్స్ కూడా అంతే హిట్ అయ్యాయి. ఈ ఇయర్ బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ గా నిలిచిన అల వైకుంఠపురములో సినిమా సాంగ్స్ ఇప్పటికీ ట్రేండింగ్ లిస్ట్ లో ఉన్నాయి. ఈ పాటలకి ఇప్పటికే చాలా మంది కవర్ సాంగ్స్ చేయగా, ఇప్పుడు రాములో రాములా పాటకి అల్లు అర్జున్ డాన్స్ ని సేమ్ టు సేమ్ దించేస్తూ ఒక పాపా డాన్స్ అదరగొట్టింది. ఈ పాపా డాన్స్ వీడియోని, ఆమె నాన్ననే షేర్ చేస్తూ అల్లు అర్జున్ ని ట్యాగ్ చేశాడు. ఈ సూపర్ డాన్స్ ని అల్లు అర్జున్ కానీ థమన్ కానీ చూసి రెస్పాండ్ అవుతారేమో చూడాలి.