మూవీ మాస్టర్ నెక్స్ట్ సినిమా అనౌన్స్మెంట్…

గతేడాది దీపావళికి ఖైదీ సినిమాతో కోలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన డైరెక్టర్ లోకేష్ కానగరాజ్, తన మూడో సినిమా అనౌన్స్మెంట్ కి రెడీ అయ్యాడు.ఖైదీ రిలీజ్ అయిన కొన్ని రోజులకే స్టార్ హీరో దళపతి విజయ్ తో మాస్టర్ మూవీ స్టార్ట్ చేసిన లోకేష్, ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసి థియేటర్స్ ఓపెన్ చేస్తే మాస్టర్ ని రిలీజ్ చేసే టైం కోసం వెయిట్ చేస్తున్నాడు.

మాస్టర్ పనులు ఎలాగో కంప్లీట్ అయ్యాయి కాబట్టి లోకేష్ తన నెక్స్ట్ మూవీని పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. ఈ సందర్భంగా మూవీ అనౌన్స్మెంట్ గురించి ట్వీట్ చేసిన లోకేష్ కానగరాజ్, ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనౌన్స్ చేయనున్నట్లు చెప్పేసాడు.

నిజానికి మాస్టర్ సెట్స్ పై ఉండగానే లోకేష్ నెక్స్ట్ మూవీ కమల్ హాసన్ తో కానీ తలైవా రజినీకాంత్ తో కానీ చేసే అవకాశం ఉందనే వార్త వినిపించింది. మరి అందరి అంచనాలకి తగ్గట్లే లోకేష్ ఈ స్టార్ హీరోస్ లో ఒకరితో మూవీ అనౌన్స్ చేస్తాడా లేక వేరే స్టార్ హీరోతో అనౌన్స్ చేస్తాడా అనేది తెలియాలి అంటే మరికాసేపు ఎదురు చూడాల్సిందే…