మరో ‘మల్టీస్టారర్’ సినిమాని నిర్మించబోతున్న ‘సురేష్ బాబు’!!

నిజ జీవితంలో నాని, రానా ఇద్దరు చాలా మంచి స్నేహితులని అందరికి తెలిసిన విషయమే. ఇండస్ట్రీలో ఇద్దరు కూడా వారి టాలెంట్ తోనే ఒక స్పెషల్ క్రేజ్ అందుకున్నారు. ఇక నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ కోసం వారిద్దరూ చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కుతుందనిపిస్తోంది.

ఇక వారి కలయికలో రాబోయే మల్టీస్టారర్ సినిమాను, స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు నిర్మిస్తారని తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ కాంపౌండ్‌లోనే ఒక ప్రముఖ దర్శకుడు వీరి కాంబినేషన్ పై ఒక స్పెషల్ స్క్రిప్ట్‌ని రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ కావచ్చని సమాచారం. ఇక సురేష్ బాబు ఇదివరకే వెంకటేష్ అలాగే నాగచైతన్యలతో కలిసి వెంకీమామ అనే ఒక మల్టీస్టారర్ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇక నాని రీసెంట్ గా సుధీర్ బాబూతో కలిసి V అనే సినిమా చేసి పాజిటీవ్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. గతంలో నాగార్జునతో కలిసి దేవ్ దాస్ అనే మల్టీస్టారర్ మూవీ కూడా చేశాడు. మరి నానితో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.