దసరాకి లక్ష్మీ బాంబు పేల్చనున్న బాలీవుడ్ ఖిలాడీ

తెలుగు తమిళ భాషల్లో రాఘవ లారెన్స్ తెరకెక్కించిన మోస్ట్ సక్సస్ ఫుల్ సిరీస్ కాంచన. ఇప్పటి వరకూ ఈ సిరీస్ లో వచ్చిన మూడు సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయ్యాయి, హారర్ జానర్ లవర్స్ ని మెప్పించాయి. ఈ సిరీస్ స్పాన్ పెంచుతూ రాఘవ లారెన్స్ కాంచనని హిందీకి తీసుకోని వెళ్లాడు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న ఈ కాంచన రీమేక్ కి లక్ష్మీ బాంబ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీపై బాలీవుడ్ ఆడియన్స్ లో చాలా అంచనాలు ఉన్నాయి. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ కరోనా కారణంగా థియేటర్స్ లో కాకుండా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అవుతుంది.

ఈ విషయంపై అనౌన్స్మెంట్ ఈ పాటికే అఫీషియల్ గా వచ్చేసినా కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే డేట్ పై మాత్రం క్లారిటీ రాలేదు. ఈ సస్పెన్స్ ని బ్రేక్ చేస్తూ అక్షయ్ కుమార్ లక్ష్మీ బాంబ్ మూవీ డిజిటల్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ దీపావళికి లక్ష్మీ బాంబుతో సెలెబ్రేట్ చేసుకోండి అంటూ నవంబర్ 9న రిలీజ్ చేస్తున్నట్లు ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ అక్షయ్ కుమార్ లుక్ కి మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి.