గద్దర్ జయంతి వేడుక – సీఎం రేవంత్ సంచలన ప్రకటన

 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కళాకారులకు ఇచ్చే నందీ అవార్డు పేరును మారుస్తున్నట్లు ప్రకటించారు. ఈ అవార్డును ఇక నుంచి గద్దర్ అవార్డుగా అందజేయడం జరుగుతుందన్నారు. బుధవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రజా గాయకుడు, దివంగత కళాకారుడు గద్దర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. నందీ అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను అందజేస్తామని ప్రకటించారు.