యాంకర్ అనసూయకు కరోనా

జబర్దస్త్ హాట్ యాంకర్, నటి అనసూయకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇటీవల తనను కలిసినవారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని ఈ అమ్మడు సూచించింది. ఒక కార్యక్రమం నిమిత్తం ఈ రోజు ఉదయం కర్నూలుకు వెళ్దామని ఉదయాన్నే లేచానని, తనలో కరోనా లక్షణాలు కనిపించాయంది. దీంతో తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నానని, వీలైనంత త్వరగా వైద్యపరీక్షలు చేయించుకుంటానంది.

PRIYAMANI TESTS CORONA

తన టెస్ట్ రిజల్ట్స్ గురించి తెలియజేస్తానని అనసూయ తన ట్విట్టర్‌లో తెలిపింది. అందరూ జాగ్రత్త అని అనసూయ పేర్కొంది. జబర్దస్త్ యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్న అనసూయ.. ఆ తర్వాత సినిమాల్లోకి కూడా అడుగుపెట్టి అక్కడ కూడా రాణిస్తోంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోంది.