ర‌జ‌నీ ఫ్యాన్స్ ఆందోళన‌లు.. ప్లీజ్‌ న‌న్ను ఇబ్బందిపెట్ట‌కండి!

త‌మిళ‌సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ మ‌రోసారి అభిమానుల‌కు త‌న పొలిటిక‌ల్ ఎంట్రీపై స్ప‌ష్టంచేశారు. కొద్దిరోజుల క్రితం ర‌జ‌నీ అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో కొద్దిరోజులు హైద‌రాబాద్‌లోని అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయాల్లోకి రాలేన‌ని గ‌త నెల 29న ర‌జ‌నీ త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. దీంతో త‌లైవా రాక కోసం ఏళ్ల త‌ర‌బ‌డి ఎదురుచూస్తోన్న అభిమానులు తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయారు. ఈ క్ర‌మంలో తాను ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో పార్టీని ప్ర‌క‌టించ‌లేన‌ని ఆయ‌న చెప్పారు. అభిమానులు త‌న‌ను క్షమించాల‌ని ట్వీట్ చేశారు.

rajanikanthh

అయితే మ‌రోసారి ర‌జ‌నీ అభిమానులు త‌లైవా నిర్ణ‌యాన్ని మ‌రోసారి ప‌రిశీలించుకోవాల‌ని కొందరు అభిమానులు కోరారు. ఈ నేప‌థ్యంలో ఆదివారం ర‌జ‌నీ అభిమానులు ఓ ర్యాలీని నిర్వ‌హించ‌డంతో ర‌జ‌నీకాంత్‌ స్పందించారు. తాను రాజ‌కీయాల్లోకి రాన‌ని, ఆందోళ‌న‌తో ఇబ్బందిపెట్టోద‌ని రజ‌నీకాంత్ లేఖ రూపంలో ట్విట్ట‌ర్ ద్వారా సోమ‌వారం విడుద‌ల చేశారు. రాజ‌కీయాల్లోకి రాలేక‌పోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను నేను ఇటీవ‌లే వివ‌రంగా తెలిపాను. కాగా ఆ త‌ర్వాతే త‌న‌ నిర్ణ‌యాన్ని వెల్ల‌డించాన‌ని, ఇప్పుడు ఇలాంటి ఆందోళ‌న‌లు చేసి త‌న‌ను బాధ‌పెట్టొద్దని అభిమానుల‌ను కోరారు. అలాగే నా నిర్ణ‌యాన్ని మార్చుకోవాలంటూ ఒత్తిడి చేయొద్ద‌ని, అభిమానుల ప్ర‌వ‌ర్త‌న‌తో తాను తీవ్రంగా క‌ల‌త చెందానని.. న‌న్ను అర్థం చేసుకుని ఇలాంటి ధ‌ర్నాలు, ర్యాలీలు నిర్వ‌హించ‌వ‌ద్ద‌ని ఆ లేఖ‌లో కోరారు.