టీమ్ఇండియాపై అమితాబ్‌బ‌చ్చ‌న్‌ ప్ర‌శంస‌లు!

సిడ్నీలో జ‌రిగిన ఇండియా-ఆస్ట్రేలియా మూడో టెస్ట్‌లో బార‌త్‌జ‌ట్టు డ్రాగా చేసింది. గెలుపు ఆశ‌లో నుంచి ఓట‌మి ప్ర‌మాదంలోకి వెళ్లిన టీమ్ఇండియా 407 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో రెండో ఇన్నింగ్స్ కొన‌సాగించి చివ‌రికి 334.5 స్కోర్ సాధించింది. హ‌నుమ విహారీ, ర‌విచంద్ర‌న్ ఆశ్విన్ కీల‌క ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్ద‌రు చివ‌రివ‌ర‌కు క్రీజులో పాతుకుపోయి ఆసీస్ విజ‌యాన్ని అడ్డుకున్నారు. దీంతో టెస్ట్ క్రికెట్ చ‌రిత్ర‌లోనే అత్యుత్త‌మ పోరాటాల్లో ఒక‌టిగా నిలుస్తుంది. ఇక ఆసీస్‌తో త‌ల‌ప‌డి డ్రాగా ముగించిన టీంఇండియాపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌బ‌చ్చ‌న్ ప్ర‌శంస‌లు కురిపించారు. అత్యంత ఆసాధ్యమైన ప‌రిస్థితుల్లో మ్యాచ్‌ను డ్రాగా ముగించార‌ని అభినందించారు. ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశార‌ని కితాబునిచ్చారు.

bigb about team india

గాయాల బాధాలు, జాత్యహంకార దూష‌ణ‌ల ప‌ర్వం క‌లిగించిన విసుగు నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తూ మ్యాచ్‌ను సుర‌క్షితంగా ముగించార‌ని అమితాబ్ కొనియాడారు.. టీమ్ఇండియా! నువ్వు అత్యంత దృఢ‌వైఖ‌రి క‌న‌బ‌ర్చావు.. ప్ర‌తి భార‌తీయుడి హృద‌యాన్ని గ‌ర్వంతో ఉప్పొంగేలా చేశావు అంటూ అమితాబ్ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. ఇక స్కోర్ బోర్డు వివ‌రాలు.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 338 ఆలౌట్‌, స్మిత్ 131, ల‌బుషేన్‌(91).. జ‌డేజా నాలుగు వికెట్లు. భార‌త్ తొలి ఇన్నింగ్స్‌: 244 ఆలౌట్‌, పుజారా(50), గిల్‌(50).. కమిన్స్ 4వికెట్లు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: 312/6 డిక్లేర్డ్‌: గ‌్రీన్‌(84), స్మిత్‌(81).. సైని 2వికెట్లు. భార‌త్ రెండో ఇన్నింగ్స్‌: 334/5: ప‌ంత్‌(97), పుజారా(77).. హేజిల్‌వుడ్ 2వికెట్లు.‌