అనసూయకు మరో సినిమా ఛాన్స్

యాంకర్‌గా సక్సెస్ అయిన అనసూయ.. మంచి నటిగా కూడా నిరూపించుకుంటోంది. ఇప్పటికే పలు సినిమాల్లో ఆమె చేసిన పాత్రలు ప్రేక్షకులను అలరించాయి. దీంతో వరుసగా ఆమెకు సినిమా ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా మరో సినిమాలో అనసూయ ఆఫర్ కొట్టేసింది.

anasuya

మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘కిలాడీ’ సినిమాలో కీలక పాత్రలో అనసూయ నటించనుందని సమాచారం. అందులో అనుసూయ పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. ఇది ఫర్ఫామెన్స్‌కు ఎక్కువగా అవకాశం ఉన్న పాత్ర అని తెలుస్తోంది. అనసూయతో పాటు ఈ సినిమాలో డింపుల్ హయాతి , మీనాక్షి చౌదరి కీలక పాత్రలలో నటించనున్నారు.

ఇటీవలే విడుదలైన కిలాడీ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం క్రాక్ సినిమాతో పాటు కిలాడీ సినిమాలో రవితేజ నటిస్తున్నాడు.