రోజా లవ్ స్టోరీలో ట్విస్ట్‌లే ట్విస్ట్‌లు .. అసలు సీక్రెట్స్ బయటపెట్టిన రోజా

రోజా.. తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా అందరికీ తెలిసిన పేరే.. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించిన రోజా.. ప్రస్తుతం ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే జబర్దస్త్ లాంటి ప్రొగ్రామ్స్‌కు జడ్జిగా వ్యవహరిస్తోంది.

roja selvamani

రోజాది లవ్ మ్యారేజ్ అనే విషయం మనందరికీ తెలిసిందే. తమిళ దర్శకుడు సెల్వమణిని ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. అయితే తాజాగా జబర్దస్త్ ఎపిసోడ్‌లో తన ప్రేమ వివాహం గురించి రోజా ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. తన ప్రేమను గెలుచుకునేందుకు సెల్వమణి చాలా ప్లాన్స్ చేశారని, తన కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత సెల్వమణి తనకు ప్రపోజ్ చేశాడని రోజా తెలిపింది.

తాను సీతారత్నం గారి అబ్బాయి సినిమా షూటింగ్‌లో ఉండగా సెల్వమణి తన దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేశాడని, మీ కుటుంబసభ్యులు కూడా ఒప్పుకున్నాడని చెప్పడంతో తాను ఆశ్చర్యపోయానని రోజా చెప్పింది. రోజా చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.