మెగాస్టార్ కోసం పూజలు చేస్తున్న ప్రముఖ నటి

మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకడంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. అందులో భాగంగా చిరు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలంటూ ప్రముఖ నటి నవీనా రెడ్డి ఒక దేవాలయంలో ఆయన పేరుమీద అర్చనలు జరిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

naveena reddy

చిరు త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఈ సందర్భంగా నవీనా రెడ్డి తెలిపింది. చిరు కరోనా బారిన పడ్డారనే వార్తలు తనను బాధకు గురిచేశానని, ఆయనకు తాను పెద్ద అభిమానిని అని నవీనా రెడ్డి చెప్పుకొచ్చింది. త్వరలో కరోనా నుంచి కోలుకుని చిరు తిరిగి వస్తారనే నమ్మకం తనకు ఉందని నవీనా రెడ్డి చెప్పింది.

ఎఫ్ 2, వెంకీ మామ, భీష్మ, ఉప్పెన, వంటి సినిమాలలో నవీనా రెడ్డి నటించి ప్రేక్షకుల ఆదరణ పొందింది.. నాని నిర్మాత గా విశ్వక్ షేన్ హీరోగా వచ్చిన హిట్ సినిమాలో లేడి కిల్లర్ గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం అర్ధ శతాబ్దం, దేవినేని, ప్లాన్ బి వంటి సినిమాలలో కూడా నటిస్తున్న నవీనా రెడ్డి.. ప్రముఖ కమర్షియల్ కంపెనీ యాడ్స్ లలో సైతం నటించి మోడల్ గా కూడా బాగా గుర్తింపు పొందింది.