అనసూయకు మరో బంపర్ ఛాన్స్

జబర్దస్త్ యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్న అనసూయ.. ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్‌పైకి కూడా అడుగుపెట్టింది. రంగస్థలం సినిమాతోని రంగమ్మత్త క్యారెక్టర్‌తో మంచి పేరు తెచ్చుకుంది ఈ అమ్మడు. ఆ తర్వాత అనసూయకు అవకాశాలు మరింతగా పెరిగిపోయాయి. ప్రస్తుతం అనేక సినిమాల్లో నటిస్తున్న అనసూయకు తాజాగా మరో బంపర్ ఛాన్స కొట్టేసింది.

ANASUYA IN PAWAN MOVIE
ANASUYA IN PAWAN MOVIE

ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో అనసూయకు అవకాశం లభించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. పవన్-క్రిష్ కాంబినేషన్‌లో రానున్న సినిమాలో అనసూయ ఒక స్పెషల్ సాంగ్‌లో కనిపించనుందట. అలాగే ఈ సినిమాలో ఒక చిన్న పాత్రను కూడా పోషించనుందట. ఈ సినిమాను సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం.ఎం. రత్నం నిర్మిస్తున్నారు. దీనికి కీరవాణి మ్యూజిక్ అందించనున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.