చిరు చెల్లిగా నయనతార?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది పూర్తైన తర్వాత ‘లూసీఫర్’ తెలుగు రీమేక్‌లో చిరు నటించనున్నాడు. ఇప్పటికే రాంచరణ్ ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడు. తెలుగు రీమేక్‌కు జయంరాజా దర్శకత్వం వహించనున్నాడు. మొదట సుజీత్, వినాయక్ పేర్లు వినిపించగా.. చివరికి జయంరాజాకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు.

NAYANATARA PLAY CHIRU SISTER

అయితే ఈ సినిమాలో చిరుకు చెల్లెలిగా నయనతార నటించనుందని ప్రచారం జరిగింది. మలయాళంలో ఈ సినిమాలో మోహన్ లాల్ చెల్లిగా మంజు వారియర్ నటించింది. సినిమాలో ఈ పాత్ర చాలా కీలకమైనది. దీంతో నయనతార అయితే న్యాయం చేయగలుగుతుందని మేకర్స్ భావిస్తున్నారట.