పెళ్లి అనంత‌రం బాయ్‌ఫ్రెండ్‌తో కాజ‌ల్ అగ‌ర్వాల్‌..

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్, వ్యాపార వేత్త‌ గౌత‌మ్ కిచ్లుతో వివాహం గ‌త ఏడాది ఘ‌నంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. ల‌క్ష్మీక‌ళ్యాణం సినిమాతో 2007లో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది ఈ అమ్మ‌డు. ఆ త‌ర్వాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన చంద‌మామ సినిమాలో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది కాజ‌ల్‌. ఇక ద‌ర్శ‌క దిగ్గ‌జం రాజ‌మౌళి తెర‌కెక్కించిన మ‌గ‌ధీర చిత్రంలో మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్‌కు జోడీగా కాజ‌ల్ న‌టించి మిత్ర‌వింద‌గా అభిమానుల్లో గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసింది.

kajal aggerwal

ఆ త‌ర్వాత తెలుగుతో పాటు త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో ప‌లు చిత్రాలు న‌టించి ప్ర‌తిభావంతురాలైన న‌టి అని కాజ‌ల్ గుర్తింపు తెచ్చుకుంది. కాగా తాను ఎక్క‌డున్నా ఇంకా పెళ్లి ధ్యాస‌లోనే ఉంటుంది. త‌మ వివాహానికి సంబంధించిన ఆ మ‌ధుర జ్ఞాప‌కాల‌ను ప‌దే ప‌దే గుర్తు చేసుకుని సంతోష‌ప‌డుతోంది. ఈ క్ర‌మంలో తాజాగా గౌత‌మ్ కిచ్లూతో స్నేహం, ప్రేమ‌, పెళ్లి, హ‌నీమూన్, సినిమాల‌పై ప‌లు విష‌యాల‌ను త‌న ఇన్‌స్ట్రాగ్రామ్‌లో అభిమానుల‌తో పంచుకుంది కాజ‌ల్‌. పెళ్ల‌య్యాక తాను మ‌రింత హ్యాపీగా ఉన్నానని, త‌న భ‌ర్త‌తోక‌లిసి దిగిన ఫోటోల‌ను షేర్ చేసింది. అలాగే నా బెస్ట్ ఫ్రెండే నా భ‌ర్త కావ‌డం చాలా ఆనందంగా ఉంది అంటూ భ‌ర్త‌తో దిగిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇదిలా ఉంటే.. కాజ‌ల్ ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే త‌మిళంలో క‌మ‌ల్‌హాస‌న్ స‌ర‌స‌న భార‌తీయుడు-2లో న‌టిస్తోంది.