అఫీషియల్: ప్రభాస్ సినిమాలో అమితాబ్ బచ్చన్ స్పెషల్ రోల్

ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రూపొందుతున్న బిగెస్ట్ పాన్ ఇండియన్ మూవీ కోసం మరో స్టార్ కూడా సిద్ధమయ్యాడు. ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నట్లు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పటికే చిత్ర యూనిట్ హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొనెను ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు ఎంతో అనుభవం ఉన్న అమితాబ్ బచ్చన్ ని కూడా ఫిక్స్ చేయడంతో ఒక్కసారిగా ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమితాబ్ బచ్చన్ అంటే ప్రభాస్ కి ఇష్టమైన నటుడు. అలాంటి హీరోతో కలిసి మొదటి సారి వెండితెరపై కనిపించబోతున్నాడు. ఇక అభిమానుల్లో ఈ అప్డేట్ అంచనాల డోస్ ని మరింత పెంచేసిందనే చెప్పాలి. వైజయంతి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.