ఆన్ లైన్ లో బెట్టింగ్ కూడానా.. హీరోయిన్ పై కొత్త అనుమానాలు

శాండీల్ వూడ్ సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వివాదం ఇప్పట్లో తగ్గేలా లేదు. సంజన గల్రాని, రాగిణి ద్వివేది పోలీసులు కస్టడిలో ఉన్న విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ స్టార్ హీరోయిన్స్ బెయిల్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వారిక్ బెయిల్ లభించడం లేదు. ఇక చాలా రోజుల తరువాత మరో కొత్త అనుమానం హాట్ టాపిక్ గా మారుతోంది.

గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పటికే డ్రగ్స్ కేసులో అనేక రక్క్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంజన అక్రమాస్తులు కూడా చాలానే ఉన్నట్లు తెలుస్తుంది. ఈడీ అధికారులు ప్రస్తుతం ఆమె ఆస్తులపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే సంజన తన పరిచాయలతో ఆన్ లైన్ బెట్టింగ్ ద్వారా కూడా బాగానే సంపాదించినట్లు మరో కొత్త అనుమానం హాట్ టాపిక్ గా మారింది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయకతప్పదు