రవితేజతో రోమాన్స్ చేస్తానంటున్న పవన్ హీరోయిన్

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో నటించనున్నాడు. దీని తర్వాత ‘వీర’ సినిమా డైరెక్టర్ రమేష్ వర్మ డైరెక్షన్‌లో రవితేజ మరో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

raviteja

నటీనటులను ఎంపిక చేసే పనిలో మేకర్స్ ఉన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్‌తో రమేష్ వర్మ గతంలో తీసిన రాక్షసుడు సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో ఇప్పుడు రవితేజ్‌తో తీయనున్న సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాతో రవితేజ సరసన ప్రణీతను ఎంపిక చేసినట్లు సమాచారం. పవన్ కల్యాణ్‌-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా ప్రణీత నటంచింది. ఆ సినిమాతో మంచి పేరును కూడా సంపాదించుకుంది.

ఆ తర్వాత ప్రణీతకు సరైన అవకాశాలు రావడం లేదు. దీంతో గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ప్రణీత.. ఇప్పుడు రవితేజ సినిమాలో అవకాశం కొట్టేసినట్లు తెలుస్తోంది.