పోలింగ్ కేంద్రాల వద్ద సినీ సెలబ్రెటీల సందడి

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఇవాళ పోలింగ్ జరుగుతుండగా.. పోలింగ్ కేంద్రాల మధ్య సందడి వాతావరణం నెలకొంది. ఇక కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణ వాతావరణం ఉంది. ప్రస్తుతానికి అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సామాన్య ప్రజలతో పాటు సినీ సెలబ్రెటీలు ఆసక్తి చూపుతున్నారు. ఎప్పుడూ షూటింగ్స్‌లో బిజీగా ఉండే సినీ సెలబ్రెటీలు ఇవాళ కాస్త విరామం ఇచ్చి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు.

nagarjuna

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున, ఆయన భార్య అమలు ఓటుహక్కును వినియోగించుకున్నారు జూబ్లిహిల్స్‌లోని ఒక పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. ఇక నటుడు రాజేంద్రప్రసాద్ కూడా తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. తక్కువ ఓటింగ్ నమోదు కావడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన రాజేంద్రప్రసాద్.. నగర ప్రజలు బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

ఇక సినీ నటి మంచు లక్ష్మీ ఫిలింనగర్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటుహక్కు వినియోగించుకుంది. ఇక ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి తన కుటుంబసభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు. వీరితో పాటు పలువురు సెలబ్రెటీలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కాగా పోటీపోటీగా జరుగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.