బాలీవుడ్ నటి కియారా అద్వానీ తెలుగులో మహేశ్‌బాబు సినిమా భరత్ అనే నేను తో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ భామ ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్గా హోదా సంపాదించుకుంది. ఆ సినిమా హిట్ తర్వాత రామ్‌చరణ్ సరసన వినయ విధేయ రామలోనూ తన అందచందాలతో బాగానే ప్రేక్షకుల్నీ ఆకర్షించింది. కాగా ఈ నూతన సంవత్సరానికి ఆనందంగా పలికింది కియారా. ఇటీవలే న్యూఇయర్ వేడుకల కోసం మాల్దీవులకు వెళ్లి సందడి చేసింది.
వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో సందడి చేశాయి.. మాల్దీవుల విహారంలో నచ్చింది తింటూ గడిపేసిన కియారా.. ఇప్పుడు కేలరీలను కరిగించే పనిలో పడింది. శక్తివంతమైన వ్యాయామాలు చేస్తూ తీవ్రంగా కష్టపడుతుంది. దీనికి సంబంధించిన ఫోటోలను కియారా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. ఛార్జ్డ్ ఫర్ 2021 అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆరోగ్యంపైనా కియారాకు ఎంతో శ్రద్ధ ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కియారా బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్ర సరసన షేర్షా సినిమాలో నటిస్తోంది.