కేజీఎఫ్-2 టీజర్ ఆల్ టైం రికార్డు

కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీఎఫ్ 2’ టీజర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తూ రికార్డులను బద్ధలు కొడుతోంది. విడుదలైన 24 గంటల్లోనే 78 మిలియన్ ప్లస్ వ్యూస్ సాధించింది. అలాగే 4.3 మిలియన్ లైక్స్‌ని సంపాదించింది. దీంతో సౌత్ ఇండియాలోనే తక్కువ వ్యవధిలో అత్యధిక వ్యూస్, లైక్స్ సాధించిన సినిమా టీజర్‌గా నిలిచింది.

KGF-2 TEASER RECORD VIEWS

టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో.. సినిమా యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. టీజర్‌ను సక్సెస్ చేసిందుకు ధన్యవాదాలు అని హీరో యశ్ ట్వీట్ చేశాడు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా.. సంజయ్ దత్, రావు రమేశ్, రవీనా టండన్‌లు కీలక పాత్రలలో నటించారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందించగా.. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.