రవితేజ ‘క్రాక్ ‘ ఆగిపోవడానికి కారణమిదే?

రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా క్రాక్. శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఇవాళ విడుదల అవ్వగా… మార్నింగ్ షో క్యాన్సిల్ అయింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 11 గంటల నుంచి షో నడుస్తుండగా.. మల్టీఫ్లెక్స్‌లలో ఆగిపోయింది. మల్టీఫ్లెక్స్ థియేటర్లలో మధ్యాహ్నం షో నుంచి సినిమా ఆడే అవకాశముంది. మార్నింగ్ షో నిలిచిపోవడంతో.. రవితేజ అభిమానులు నిరాశకు గురయ్యారు.

RESAON BEHIND KRACK CANCEL

ఈ సినిమా నిలిచిపోవడానికి నిర్మాత ఠాగూర్ మధుకు ఉన్న అర్థిక లావాదేవీలే కారణమని తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ హీరోగా తెరకెక్కిన అయోగ్య సినిమాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై కోర్టులో కేసు నడుస్తోంది. ఈ సినిమా వివాదంలో క్రాక్ సినిమా నిర్మాత ఠాగూర్ మధు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే చెన్నైకి చెందిన ఒక నిర్మాణ సంస్థ క్రాక్ సినిమా విడుదలని అడ్డుకుందని సమాచారం.