‘యష్ KGF’ మాస్ సర్ప్రైజ్ వీడియో రిలీజ్!!

కన్నడ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ తారలలో ఒకరైనా యష్ కెజిఎఫ్ చాప్టర్ 1తో భారీ క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక అభిమానులు సినిమా సీక్వెల్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. KGF2లో రాకీ భాయ్ ఉహాలకందని విధంగా కనిపిస్తాడని అర్ధమవుతోంది. KGF: చాప్టర్ 1 ను హిందీలో విడుదల చేసిన ఫర్హాన్ అక్తర్ యొక్క ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు అధికారికంగా ఆశ్చర్యకరమైన వీడియోను విడుదల చేసింది!

వీడియోలో అంతా అద్భుతమైన చిత్రం ఎలా తయారైంది అనే అలాగే అంత ప్రజాదరణ పొందడానికి చిత్ర యూనిట్ ఎలా కష్టపడి పనిచేసింది అనే విషయంగా ఈజీగా అర్ధమవుతోంది. ఈ వీడియోను చూస్తే, ఈ చిత్రం యొక్క సీక్వెల్ ఇంకా హై రేంజ్ లో ఉండబోతోందని ఆ సినిమా కోసం చిత్ర యూనిట్ ఇంకెంత కష్టపడుతుందో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గత నెలలో 26 న ఈ సీక్వెల్ కోసం షూట్ ను తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే.