‘కమల్ హాసన్’ తరువాత ఆ రికార్డును వేగంగా అందుకున్న ‘సూర్య’!!

నటుడు సూర్య కోలీవుడ్‌లోని అగ్రశ్రేణి హీరోలలో ఒకరని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నెరుక్కు నేర్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ నటుడు సినిమా సినిమాకు తన నటన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నాడు, విమర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. కోట్లాది మంది అభిమానులను గెలుచుకున్నాడు. 23 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్న ఈ నటుడికి తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు.

సూర్య 2015 లో సోషల్ మీడియాలో అడుగుపెట్టాడు. ఇప్పుడు తన ట్విట్టర్ హ్యాండిల్ 6 మిలియన్ల ఫాలోవర్స్ మైలురాయిని దాటి ఈ నటుడు కొత్త రికార్డ్ సృష్టించాడు. ఐదేళ్లలోనే సూర్య ట్విట్టర్‌లో 6 మిలియన్ల మంది ఫాలోవర్లను దాటడం విశేషం. కమల్ హాసన్ తర్వాత సోషల్ మీడియాలో అత్యంత వేగంగా ఫాలోవర్స్ ను గెలుచుకున్న రెండవ నటుడు సూర్య అనే చెప్పవచ్చు. 6MillionLoveForSuriya అనే హ్యాష్‌ట్యాగ్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూర్య ఫొటోలను కూడా అభిమానులు చాలానే షేర్ చేసుకుంటున్నారు.