లాక్‌డౌన్‌లో పూర్తి చేసిన ప్రత్యేక ప్రాజెక్టులపై క్లారిటీ ఇచ్చిన ‘సమంత’!!

కరోనావైరస్ లాక్ డౌన్ సమయంలో తమిళ తెలుగు చిత్రాల షూటింగ్స్ లలో బిజీగా ఉన్న సమంతా ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకుంది. వంటపై అలాగే సేంద్రీయ వ్యవసాయం, కొత్త ఫిట్‌నెస్ కి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంది. సామ్ చాలా కాలం తరువాత ట్విట్టర్‌లో లైవ్ లోకి వచ్చింది. ఆమె అభిమానులు అడిగిన ప్రశ్నలకు కూడా ఆమె సమాధానం ఇచ్చింది.

లాక్ డౌన్ సమయంలో తాను పూర్తి చేసిన కొత్త ప్రాజెక్ట్స్ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నాయని అవి అభిమానుల ముందుకు వీలైనంత త్వరగా రావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. విజయ్ సేతుపతితో నటించిన కొత్త తరహా త్రిల్లర్ సినిమాకి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాడని అలాగే అశ్విన్ శరవణన్ తో కూడా మరో డిఫరెంట్ సినిమా చేసినట్లు తెలిపింది. ఇక COVID 19 కారణంగా ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న కఠినమైన సమయాల గురించి, సామ్ మాట్లాడుతూ, ఇది చాలా మందికి మరింత కఠినమైనది అంటూ త్వరలోనే ఈ కష్టాల నుంచి బయటపడాలని కోరుకుంటున్నట్లు వివరణ ఇచ్చారు.