‘V’ సినిమాలో .. మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా ‘సుధీర్ బాబు’!!

టాలీవుడ్ జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో V సినిమా ఒకటి. కొన్ని గంటల్లో OTTలో విడుదల కానున్న సినిమాలో నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావు హైడారి ముఖ్య పాత్రల్లో నటించారు. దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రతి పాత్ర కూడా సినిమాపై అంచనాలు ఓఎంచుతోంది. ముఖ్యంగా సుధీర్ బాబు పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపిస్తుండడం సినిమాకే మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.

ఇక చాలామందికి తెలిసే ఉంటుంది. హైదరాబాద్ టైమ్స్ ప్రతి సంవత్సరం ఒక పోల్ నిర్వహిసస్తోంది. అందులో ప్రేక్షకులు తమ అభిమాన టాలీవుడ్ మరియు టెలివిజన్ ప్రముఖులకు మోస్ట్ డిజైరబుల్ పురుషులు మరియు మహిళలకు ఓటు వేయవచ్చు. వాస్తవానికి, మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 జాబితాలో సుధీర్ బాబు 8 వ స్థానాన్ని దక్కించుకున్నారు. హైదరాబాద్ టైమ్స్ తో మాట్లాడుతూ, ఈ చిత్రంలో తాను యంగ్ అండ్ హాట్ హెడ్ కాప్ గా నటించానని చెప్పాడు. “ఈ చిత్రంలో నా పాత్ర మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకుంటుంది. అతని బయోపిక్ కూడా కార్డులలో ఉంటుంది. అతను డిపార్టుమెంటులో అత్యుత్తమ పోలీసు అధికారిగా ప్రఖ్యాతి గాంచాడు. నాని పాత్ర అడుగు పెట్టే వరకు అంతా తన దారిలోనే సాగుతుంది. అంతా అక్కడినుండి దిగజారి, అతని జీవితాన్ని తలక్రిందులుగా చేస్తుంది. ” అని సుధీర్ తెలిపాడు.