తమిళ్లోనే కాదు తెలుగులో కూడా రికార్డులే విజిల్ టార్గెట్

దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా బిగిల్. అట్లీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 25న దీపావళి ప్రేక్షకుల కానుకగా ముందుకి రానుంది. రిలీజ్ సమయం దగ్గర పడుతుతుండంతో చిత్ర యూనిట్, ఈ సినిమా ట్రైలర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. బిగిల్ ట్రైలర్ ఇప్పటి వరకూ 28 మిలియన్ వ్యూస్ రాబట్టి కొత్త చరిత్ర సృష్టించింది. వ్యూస్ తోనే కొత్త చరిత్ర సృష్టించిన బిగిల్, 2 మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకుని ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. వరల్డ్ లో ఇప్పటి వరకూ హైయెస్ట్ లైక్స్ సాధించిన టీజర్స్, ట్రైలర్స్ లో బిగిల్ 5వ పొజిషన్ లో నిలవగా, ఇండియాలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది.

ఏ ఇండియన్ సినిమాకి దక్కని రికార్డుని సొంతం చేసుకున్న బిగిల్ సినిమాని తెలుగులో విజిల్ గా రిలీజ్ చేయబోతున్నారు. తమిళ వెర్షన్ రిలీజ్ అయిన మూడు రోజుల తర్వాత బయటకి వచ్చిన విజిల్ ట్రైలర్ తెలుగులో కూడా 18 గంటల్లో 1.6 మిలియన్ వ్యూస్ రాబట్టింది. 206k లైక్స్ ని రాబట్టి విజిల్ ట్రైలర్ తెలుగు సినీ అభిమానులని కూడా మెప్పించింది. దీపావళికి రిలీజ్ కానున్న ఈ సినిమాకి కార్తీ నటించిన ఖైదీ సినిమా నుంచి పోటీ ఎదురుకానుంది.