కేజీఎఫ్ బీయూటీకి కోలీవుడ్ లో క్రేజీ ఆఫర్…

కన్నడ స్టార్ హీరో యష్ నటించిన లేటెస్ట్ సినిమా కేజీఎఫ్. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియన్ ప్రేక్షకులని అలరించింది. శాండల్ వుడ్ ఇండస్ట్రీ రికార్డులని చెరిపేసిన కేజీఎఫ్ యష్ ని నేషనల్ స్టార్ ని చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ పనులు జరుగుతున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టికి కూడా మంచి మార్కులే పడ్డాయి.

srinidhi shetty

కేజీఎఫ్ చాప్టర్ 2లో కూడా నటిస్తున్న శ్రీనిధి శెట్టి ఒక క్రేజీ ఆఫర్ కొట్టేసింది. కోలీవుడ్ లో తెరకెక్కిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన విక్రమ్ 58వ సినిమాలో శ్రీనిధి హీరోయిన్ గా నటిస్తోంది. జ్ఞానముత్తు తెరకెక్కిస్తున్న ఈ సినిమాని లలిత్ కుమార్ నిర్మిస్తున్నాడు. రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ 25 పాత్రల్లో కనిపించనున్నాడు. ఇండియన్ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విక్రమ్58 సినిమాలో విలన్ గా నటిస్తుండడం విశేషం.