ఆ హీరోతో ఐదోసారి నటించడానికి నయనతార రెడీ

బిల్లా, ఏగన్, ఆరంభం, విశ్వాసం… తల అజిత్ హీరోగా నటించిన సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవి. కాసుల వర్షం కురిపించిన ఈ సినిమాల్లో కామన్ గా ఉన్న పాయింట్ అజిత్ పక్కన నయనతార హీరోయిన్ గా నటించడం. అజిత్, నయనతార కాంబినేషన్ అంటే ఆ సినిమా హిట్ అనే నమ్మకం కలిగించిన ఈ ఇద్దరూ రీసెంట్ గా నటించిన సినిమా విశ్వాసం. 2019 సంక్రాంతికి రిలీజ్ అయిన విశ్వాసం సినిమా లీడ్ పెయిర్ కి కెరీర్ హిట్ అందించింది.

nayanthara

తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు అజిత్, నయనతార ఇద్దరూ ఐదోసారి కలిసి నటించబోతున్నారని సమాచారం. బోనీ కపూర్ నిర్మాణంలో వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తల60 సినిమాలో నయన్ హీరోయిన్ గా నటించనుందని సమాచారం. ఇదే సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ కూడా నటించే అవకాశం ఉండాలి కోలీవడ్ వర్గాల ఇన్ఫర్మేషన్. అజిత్ పక్కన నయన్ నటిస్తే, తెలియకుండానే సినిమాకి కావాల్సిన హైప్ వస్తుంది కాబట్టి చిత్ర యూనిట్ ఆమెనే ఫైనల్ చేసే అవకాశం ఉంది.