ఓటీటీలోకి మాస్ కా దాస్… అంత ఈజీ కాదు

2020లో ‘హిట్’ సినిమాతో భారీ హిట్ అందుకున్న హీరో విశ్వక్ సేన్. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న ఈ యంగ్ హీరో, పాగల్ తో ప్రేక్షకులని పలకరించడానికి రెడీ అవుతున్నాడు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోని విడుదలకి సిద్ధంగా ఉన్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చి బ్రేక్ వేసింది. ప్రస్తుత పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో తెలీదు, థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియదు.

అందుకే పాగల్ సినిమాని ఓటీటీలో విడుదల చేయడానికి చూస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ అమెజాన్ ప్రైమ్, ఆహాలు కూడా పాగల్ టీంతో చర్చలు జరుపున్నాయని సమాచారం. అయితే ఫలక్ నామా దాస్ సినిమాని థియేటర్స్ లో చూపించడానికి ఎన్ని రోజులు అయినా వెయిట్ చేసిన విశ్వక్ సేన్, పాగల్ విషయంలో అంత ఈజీగా ఓటీటీ డెసిషన్ తీసుకుంటాడా అంటే కష్టమనే చెప్పాలి.