సాయి పల్లవి కోసం రష్మికకి హ్యాండ్ ఇస్తున్న డైరెక్టర్?

ఇండస్ట్రీలో హిట్ కి ఉండే రెస్పెక్ట్ వేరు. ఒక్క హిట్ పడితే చాలు అందులో పని చేసిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వస్తుంది. ముఖ్యంగా హిట్ మూవీలో నటించిన హీరో హీరోయిన్లకి అయితే హిట్ పెయిర్ అనే కాంప్లిమెంట్స్ వచ్చేస్తాయి. వాళ్లని మళ్లీ కలిపి సినిమా చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. అలాంటి ఒక మ్యాజిక్ టాలీవుడ్ లో మరోసారి జరగబోతుంది. ఫిదా మూవీతో అందరినీ ఫిదా చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మలర్ సాయి పల్లవి మరోసారి కలిసి నటించబోతున్నారు. ఫిదా అంత పెద్ద హిట్ అయ్యింది అంటే దానికి కారణం లీడ్ పెయిర్ మధ్య ఉన్న కెమిస్ట్రీనే. ఈ మ్యాజిక్ ని మరోసారి తెరపై చూపించడానికి యంగ్ డైరెక్టర్ రెడీ అవుతున్నాడు.

ప్రస్తుతం గని సినిమా చేస్తున్న వరుణ్ తేజ్, తన నెక్స్ట్ మూవీని బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తున్న డైరెక్టర్ వెంకీ కుడుములతో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటించే అవకాశం ఉందట. ఈ ఫిదా పెయిర్ ని రిపీట్ చేస్తే, ఆడియన్స్ లో కూడా ఒక పాజిటివ్ బజ్ ఉంటుందని డైరెక్టర్ భావించి ఉండొచ్చు. అయితే వెంకీ కుడుముల చేసిన రెండు సినిమాల్లో హీరోయిన్ గా రష్మికనే నటించింది. నేషనల్ క్రష్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే, రెండో సినిమాకి రష్మికతో చేసి హిట్ కొట్టిన వెంకీ కుడుముల… మూడో సినిమాకి మాత్రం సాయి పల్లవిని సెలెక్ట్ చేసుకున్నాడట. భారీ బడ్జట్ సినిమాలు చేస్తూ రష్మిక డేట్స్ కాలి లేకపోవడం ఇందుకు కారణమా లేక నిజంగానే కథలో సాయి పల్లవి మాత్రమే యాక్ట్ చేయగలిగే క్యారక్టర్ ఉందా అనేది తెలియాలి అంటే చాలా రోజులే ఆగాలి.