సేతుపతి బాలీవుడ్ మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడే…

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ వాంటెడ్ యాక్టర్. వరుసగా సినిమాలు చేస్తున్న ఈ హీరో, బాలీవుడ్ పై కన్నేశాడు. మంచి కథలు మాత్రమే చేసే సేతుపతి ఆమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దాలో అవకాశం వచ్చినా డేట్స్ లేక వదులుకున్నాడు. ఇక ఇప్పట్లో సేతుపతి బాలీవుడ్ లో కనిపించడేమో అనుకుంటున్న టైములో ఒక భారీ ప్రాజెక్ట్ లో నటించడానికి సైన్ చేశాడు.

‘అంధాదున్’ లాంటి న్యూ ఏజ్ థ్రిల్లర్ ని తెరకెక్కించిన దర్శకుడు శ్రీరామ్ రాఘవన్, సేతుపతితో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ డివా కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ లోనే షూటింగ్ మొదలవ్వాల్సిన ఈ మూవీ షూటింగ్ కరోనా కారణంగా డిలే అయ్యింది. జూన్ లో తిరిగి ప్రారంభం కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ‘మెర్రీ క్రిస్మస్​’ టైటిల్‌ ని ఫిక్స్ చేశారు.