నక్సలిజం నేపథ్యంలో ‘మాజీ’.. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

హీరోస్ ఫిల్మ్స్ బ్యానర్‌పై బి. వినోద్ కుమార్ స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘మాజీ’. ప్రస్తుతం ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని ఈ నెలాఖరుకు సెట్స్ మీదకి వెళ్ళడానికి  సిద్ధం అవుతుంది. నక్సలైట్  బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ అండ్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. హీరో, నిర్మాత, దర్శకుడైన వినోద్ కుమార్ బర్త్ డే(జూలై16) సందర్భంగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. కొత్త, పాత నటీనటులందూ ముఖ్య పాత్రల్లో నటించనున్న ఈ చిత్ర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని నిర్మాత తెలియజేశారు.
ఈ చిత్రానికి నిర్మాత మరియు దర్శకుడు: బి. వినోద్ కుమార్,  
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి. అనిల్ కుమార్,
పిఆర్ఓ: బి. వీరబాబు