అన్నాత్తె కంప్లీట్ చేసి స్టార్ హీరో సినిమా కోసం రెడీ అవుతున్న రజిని

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రతి ఏడాది అమెరికా వెళ్ళినట్లు ఈ ఏడాది కూడా అమెరికా వెళ్ళిన సంగతి తెలిసిందే. హెల్త్ చెకప్ కోసం దాదాపు 20 రోజుల పాటు అమెరికాలో ఉన్న రజిని.. ఇటీవల అమెరికా నుండి చెన్నైకి చేరుకున్నారు రజిని. ఈ క్రమంలో కొద్దిరోజుల పాటు కుటుంబ సభ్యులతో గడిపిన తలైవా తర్వాత మళ్లీ సినిమా పనులు మొదలు పెట్టడానికి సిద్దమయ్యాడు.

సిరుత్టై శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అన్నాత్తె కి సంబంధించిన చివరి షెడ్యూల్ కలకత్తా షెడ్యూల్ కంప్లీట్ చేయడానికి.. రజిని కలకత్తా కి బయలుదేరారు. ఈ షెడ్యూల్ లో ఈ మూవీ షూటింగ్ పూర్తవనుంది. అందుకే వీలైనంత త్వరగా అన్నాత్తె షూటింగ్ స్టార్ట్ చేసి.. తన వరకూ బ్యాలెన్స్ ఉన్న వర్క్ మొత్తం కంప్లీట్ చేసి నెక్స్ట్ మూవీ ధనుష్ డైరెక్షన్ లో మొదలుపెట్టాలని రజినీ ప్లాన్ చేస్తున్నాడట. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న అన్నాత్తె మూవీ దివాలి రిలీజ్ కి రెడీ అవుతోంది.