మెగా అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పిన వరుణ్‌తేజ్

మెగా ఫ్యామిలీలో ఇటీవల కరోనా కలకలం రేపిన విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రాంచరణ్‌తో పాటు మరో మెగా హీరో వరుణ్ తేజ్ కరోనా బారిన పడ్డారు. ఇద్దరు హీరోలు కరోనా బారిన పడటం టాలీవుడ్‌లో కలకలం రేపింది. రాంచరణ్, వరుణ్ తేజ్‌లకు కరోనా సోకడంతో.. మెగా ఫ్యామిలీ అందరూ కరోనా టెస్టులు చేయించుకున్నారు. రాంచరణ్, వరుణ్ తేజ్ హోం క్వారంటైన్‌లో ఉంటూ కరోనా జాగ్రత్తలు తీసుకున్నారు.

varuntej tests corona negative

ఇద్దరు హీరోలకు కరోనా సోకడంతో మెగా అభిమానులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో మెగా అభిమానులకు వరుణ్ తేజ్ శుభవార్త తెలిపారు. తనకు కరోనా నెగిటివ్‌గా తేలిందని వరుణ్ తేజ్ ట్విట్టర్‌లో తెలిపాడు. తన జీవితం మొత్తంలో ఒక రిపోర్ట్ నెగిటివ్ అనే పద ఇంత ఆనందాన్ని ఇస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు.

మీ ప్రేమ, ఆప్యాయతలకు ధన్యవాదాలు అని వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు. దీంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం f3 సినిమాలో వరుణ్ తేజ్ నటిస్తున్నాడు.