షార్ట్‌ఫిలింలో రెచ్చిపోతున్న‌అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌!

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన అఆ సినిమాలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ గ‌డుసు పిల్ల‌గా అద‌ర‌గొట్టిన సంగ‌తి తెలిసిందే. ఆమె కెరీర్ ప్రారంభంలో దిల్‌రాజు నిర్మాణంలో శ‌ర్వానంద్ హీరోగా శ‌త‌మానం భ‌వ‌తి అనే చిత్రం ద్వారా తెలుగు తెర‌కు హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయింది. ఆ ఏడాది ఈ చిత్రం ఉత్త‌మ జాతీయ చిత్రంగా నిల‌వ‌గా.. ఆ త‌ర్వాత దిల్‌రాజ్ త‌న బ్యాన‌ర్‌లో నిర్మించిన రామ్ స‌ర‌స‌న హ‌లో గురు ప్రేమ కోస‌మే చిత్రంలో అనుప‌మ‌కు మ‌రోక అవ‌కాశం ఇచ్చాడు. ప్ర‌స్తుతం అనుప‌మ నిఖిల్‌తో కలిసి 18పేజెస్ సినిమాలో న‌టిస్తోంది.

ANUPAMA HOT

త‌న అందంతో యువ‌కుల‌ను పిచ్కేక్కించిన అనుప‌మ లేటెస్ట్‌గా మ‌ల‌యాళంలో ఫ్రీడ‌మ్ ఎట్ మిడ్ నైట్ అనే షార్ట్‌ఫిలింలో న‌టించింది. ఫస్ట్‌లుక్‌తోనే ఆక‌ట్టుకున్న ఈ షార్ట్ ‌ఫిల్మ్‌కు సంబంధించిన టీజ‌ర్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా చీర‌క‌ట్టులో ఉన్న లుక్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ షార్ట్‌ఫిల్మ్ టీజ‌ర్ చూస్తే అనుప‌మ రెచ్చిపోయి న‌టించింద‌ని అర్థం అవుతోంది. ఇక ఈ షార్ట్‌ఫిలింలో మ‌ల‌యాళ న‌టుడు హ‌క్కిం షాజ‌హాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌గా.. ఆర్‌జేషాన్ ఈ షార్ట్‌ఫిల్మ్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ ల‌ఘుచిత్రాన్ని అఖిల్ మిధున్ నిర్మిస్తుండ‌గా.. త్వ‌ర‌లోనే విడుద‌ల కానున్న ఈ మ‌ల‌యాళ షార్ట్ ఫిల్మ్‌ని తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో కూడా రిలీజ్ కానుంది.