FLASH: వరంగల్‌లో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్

హీరోయిన్ ఆనంది సీక్రెట్‌ మ్యారేజ్ చేసుకోవడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఆమె అసలు పేరు కాయల్ ఆనంది. ఇవాళ రాత్రి 8 గంటలకు తెలంగాణలోని వరంగల్‌ పట్టణంలో ఈమె పెళ్లి జరగనుంది. వరంగల్‌లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో ఆనంది పెళ్లి జరగనుంది. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి కాగా.. వరుడు పేరు సోక్రటీస్. కరోనా క్రమంలో కుటుంబసభ్యులు, కొంతమంది స్నేహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరుకానున్నారు.

Actress kayal anandhi marriage

కరోనా వైరస్ ప్రభావం క్రమంలో సినిమా పరిశ్రమ నుంచి ఎవరినీ పెళ్లికి పిలవలేదు. తమిళంలో పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఆనంది.. తెలుగులో మారుతీ తెరకెక్కించిన బస్టాఫ్ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఈ రోజుల్లో, ప్రియతమా నీవచ్చట కుసలమా, నాయక్, గ్రీన్ సిగ్నల్ సినిమాల్లో నటంచింది.

ఇక తెలుగులో త్వరలో రానున్న జాంబీ రెడ్డి సినిమాలో ఆనంది నటించనుంది. ప్రస్తుతం తమిళం, తెలుగు, కన్నడ సినిమాలతో కలిపి 7 సినిమాల్లో నటిస్తోంది.