Powerstar: వకీల్‌సాబ్ నుంచి మూడో పాట త్వ‌ర‌లో..

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్ న‌టించిన తాజా చిత్రం వ‌కీల్ సాబ్‌. ఈ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టికే పోస్ట‌ర్ల్‌, టీజ‌ర్, రెండు సాంగ్స్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో నుంచి మూడో పాట అప్‌డేట్ ను ప్ర‌క‌టించారు చిత్ర‌బృందం. కంటి పాప అంటూ సాగే పాట‌ను మార్చి 17న సాయంత్రం 5.07నిమిషాల‌కు రిలీజ్ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం పై ప‌వ‌న్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

powerstar

ఇందులో Powerstar ప‌వ‌న్ స‌ర‌స‌న శ్రుతి హాస‌న్ న‌టిస్తుండ‌గా.. అంజ‌లి, నివేధా థామ‌స్‌, అన‌న్య త‌దిత‌రులు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. బాలీవుడ్ హిట్ మూవీ పింక్ రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతుండ‌గా.. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో.. దిల్ రాజు, బాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత బోనీక‌పూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ Powerstar చిత్రం ఉగాది కానుక‌గా ఏప్రిల్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.