Samantha: స‌మంత- గుణ‌శేఖ‌ర్ కాంబో శాకుంత‌లం మూవీ ప్రారంభం..

Samantha: స‌మంత అక్కినేని ప్ర‌ధాన పాత్ర‌ల్లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న శాకుంత‌లం చిత్రం ఈ రోజు లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మానికి అల్లుఅర‌వింద్ ముఖ్య అతిధిగా విచ్చేసి.. స్క్రిప్ట్‌ను గుణ‌శేఖ‌ర్‌కు అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

samantha shakunthalam

రెగ్యుల‌ర్ షూటింగ్ వ‌చ్చే వారం నుంచి జ‌రుగుతుంద‌ని తెలిపింది చిత్ర‌బృందం. ఇందులో టైలిల్ పాత్ర‌ల్లో Samantha స‌మంత న‌టిస్తుండ‌గా.. దుష్యంతుడి పాత్ర‌లో మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ న‌టిస్తున్నార‌ని చిత్ర‌బృందం వెల్ల‌డించింది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతుంద‌ని మ‌ణిశ‌ర్మ ఈచిత్రానికి స్వరాలు అందించ‌నున్నారు.