‘ఉప్పెన’ రివ్యూ.. హిట్టా?.. ఫట్టా?

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన మూవీ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పుటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. లాక్‌డౌన్ వల్ల వాయిదా పడింది. లాక్‌డౌన్ తర్వాత థియేటర్లు ఓపెన్ కావడంతో సినిమాలన్నీ విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ ఉప్పెన మూవీని విడుదల చేశారు.

uppena movie review

థియేటర్లలో 100 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీకి రెండు తెలుగు రాష్ట్రాలు అనుమతిచ్చిన క్రమంలో విడుదల కావడం ఈ సినిమాకు ప్లస్ అని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు సహా నిర్మాతగా వ్యవహించారు.

ఇక సినిమా విషయానికొస్తే.. పాజిటివ్ టాక్‌ వస్తోంది. రోటిన్ లవ్ స్టోరీఅయినా.. డైరెక్టర్ బుచ్చిబాబు స్క్రీన్‌ప్లే బాగుంది. ఇక విలన్‌గా విజయ్ సేతుపతి యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంది. విజయ్ సేతుపతి నటన ఈ సినిమాకి హైలెట్‌గా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఇక హీరోయిన్ కృతిశెట్టి నటన కూడా బాగుంది. ఇక హీరో వైష్ణవ్ తేజ్ నటన కూడా బాగానే ఉంది. ఫస్ట్ ఆఫ్ బాగుండగా.. సెకండాఫ్ కాస్త నెమ్మదించింది. క్లైమాక్స్ బాగా కంటతడి పెట్టించింది.