Prabhas: వాలంటైన్స్‌డే రోజు రాధేశ్యామ్ గ్లిమ్స్‌‌..

Prabhas: యంగ్‌రెబెల్‌స్టార్ ప్ర‌భాస్ న‌టించిన‌ తాజా చిత్రం రాధేశ్యామ్ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీ క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి రాధాకృష్ట డైరెక్ష‌న్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి స‌రికొత్త అప్‌డేట్‌ను Prabhas అభిమానుల‌తో పంచుకుంది చిత్ర‌బృందం. ఫిబ్ర‌వ‌రి 14న ప్రేమికుల రోజు సంద‌ర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేస్తున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

radeshyam glmps

ఆ రోజు ఉద‌యం 9గంట‌ల 18నిమిషాల‌కు విడుద‌ల చేస్తున్న‌ట్లు Prabhas ప్ర‌భాస్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఇక ఈ చిత్రంలో Prabhas ప్ర‌భాస్ జోడీగా పూజాహెగ్దే హీరోయిన్‌గా న‌టిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని టీ-సిరీస్ గుల్ష‌న్‌కుమార్ స‌మ‌ర్ప‌ణ‌ల‌క్ష యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై భూష‌ణ్‌కుమార్‌-వంశీ-ప్ర‌మోద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్‌డైరెక్ట‌ర్స్ ముగ్గురు.. ఈ చిత్రం హిందీ వెర్ష‌న్‌కు సంబంధించి మిథున్‌- మ‌న‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తుండ‌గా.. ఇక తెలుగుతో పాటు ద‌క్షిణాది భాష‌ల‌కు జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు.