Tollywood: నేడు క‌ళ్యాణ్‌దేవ్ బ‌ర్త్‌డే.. మైక్ ప‌ట్టుకుని విషేస్ తెలిపిన శ్రీ‌జ‌..

Tollywood: మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్‌దేవ్ న‌టించిన మొద‌టి చిత్రం విజేత‌. ఈ చిత్రంతో క‌ళ్యాణ్‌దేవ్ ప్రేక్ష‌కుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం ద‌క్క‌లేదు. త‌ర్వాత ఆయ‌న న‌టిస్తున్న చిత్రాలు సూప‌ర్ మ‌చ్చి, కిన్నెర‌సాని. వీటితో పాటు శ్రీ‌ధ‌ర్ సీపాన ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు క‌ళ్యాణ్‌దేవ్‌. ఇందులో క‌ళ్యాణ్‌కు జోడీగా అవికా గౌరు హీరోయిన్‌గా న‌టిస్తోంది.

kalyandev new movie

Tollywoodఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై టిజి విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్‌, వివేక్ కూచిబోట్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Tollywood అయితే నేడు క‌ళ్యాణ్‌దేవ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న‌కు విషేస్ తెలుపుతూ.. ప్రొడ‌క్ష‌న్ నెం-3 నుంచి ఫ‌స్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూట్‌లో క‌ళ్యాణ్‌దేవ్ భార్య శ్రీ‌జ డైరెక్ట‌ర్ ప‌క్క‌న కూర్చొని మైక్ ప‌ట్టుకుని రెడీ, రోల్‌, యాక్ష‌న్ అని చెప్ప‌గా.. హీరో క‌ళ్యాణ్‌దేవ్ స్టైలిష్‌గా న‌డుచుకుంటూ వ‌స్తున్న‌ట్లు చూపించారు. Tollywood దీంట్లో క‌ళ్యాణ్ రొమాంటిక్ లుక్‌లో కనిపించారు. ఇక ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం స‌మ‌కురుస్తున్నారు.