నెగిటివ్ రోల్‌లో అనసూయ

ఇటీవల విడుదలైన క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఖిలాడి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుండగా.. ఇందులో జబర్ధస్త్ హాట్ బ్యూటీ అనసూయ కీలక పాత్రలో నటించనున్నట్లు ఇటీవల మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే అనసూయ పాత్రకు సంబంధించి ఇప్పుడు ఒక వార్త హాట్‌టాపిక్‌గా మారింది. ఇందులో అనసూయ నెగిటివ్ రోల్ ఉన్న పాత్రలో నటిస్తుందని టాక్.

anasuya negative role

అనసూయది కీలక పాత్ర అని, సినిమా మొత్తం ఉంటుందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఇందులోని అనసూయ పాత్రపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాని రమేశ్ వర్మ తెరకెక్కిస్తుండగా.. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నాడు.