తెలుగు ప్రేక్షకులకు పండగే.. క్రిస్మస్‌కు థియేటర్లలోకి రెండు సినిమాలు

తెలంగాణలో సినిమా థియేటర్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో థియేటర్లలో సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే సాయిథరమ్ తేజ హీరోగా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదల చేయున్నట్లు ఆ సినిమా యూనిట్ ప్రకటించింది. అయితే తాజగా మరో సినిమా కూడా క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది.

solo bratukey so better

సుమంత్ హీరోగా తెరకెక్కిన కపటధారి సినిమా విడుదల తేదీని తాజాగా మేకర్స్ ప్రకటించారు. క్రిస్మస్ కానుకగా థియేటర్లలో కపటధారి సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే ఈ మూవీకి సెన్సార్ పూర్తవ్వగా.. యు/ఎ సర్టిఫికేట్ వచ్చింది.

థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను తమిళ దర్శకుడు కృష్ణమూర్తి తెరకెక్కించాడు. నాజర్, శ్వేతా నందిత, పూజా కుమార్, జయప్రకాష్, సంపత్, తదితర నటులు ఈ సినిమాలో నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ టీజర్ బాగుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. లాక్‌డౌన్ కారణంగా సినిమా థియేటర్లలో మూతపడటంతో చాలా సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. ఇప్పుడు థియేటర్లు ఓపెన్ కావడంతో థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.