వెబ్‌సిరీస్‌లోకి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఓ వెబ్‌సిరీస్‌ను రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కథ కూడా సిద్ధం అయిందని తెలుస్తోంది. తెలుగు ఓటీటీ ఆహా యాప్ కోసం ఈ వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆహా యాప్ కోసం అనేకమంది డైరెక్టర్లు వెబ్‌సిరీస్‌లు రూపొందించారు. ఇప్పుడు వంశీ పైడిపల్లి కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

vamsi paidipally

‘మహర్షి’ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి తన తర్వాతి సినిమా ఎవరితో చేస్తారనేది ప్రకటించలేదు. మళ్లీ మహేష్ బాబుతోనే వంశీ పైడిపల్లి సినిమా చేస్తారనే వార్తలు వచ్చాయి. ఈ మేరకు మహేష్‌కు కూడా వంశీ పైడిపల్లి సినిమా కథ చెప్పాడు. కానీ ఆ ప్రాజెక్టు వర్క్ కాలేదని సమాచారం.

దీంతో మహేష్ బాబు పరశురామ్ డైరెక్షన్‌లో ‘సర్కారువారి పాట’ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. లాక్‌డౌన్ వల్ల ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశముంది. దీని తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తాడని తెలుస్తోంది. దీంతో మహేష్-వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ఇప్పట్లో సినిమా ఉండకపొవచ్చని తెలుస్తోంది.