అల్లు అర్జున్ సూపర్ అంటున్న స్టార్ క్రికెటర్

అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్ రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో 450 మిలియన్స్ వ్యూస్‌ను సంపాదించుకుంది. దీంతో అల్లు అర్జున్‌కి పలువురు సెలబ్రెటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు. తెలుగులో సినిమా చరిత్రలోనే ఇప్పటివరకు యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ను సంపాదించుకున్న పాట ఇదేనని చెబుతున్నారు.

allu arjun

ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా అభినందించాడు. వెల్ డన్ అల్లు అర్జున్ అని కామెంట్ చేశాడు. దీంతో వార్నర్‌కి బన్నీ అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. గతంలో ఈ పాటకు చాలాసార్లు వార్నర్ డ్యాన్స్ వేసిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారాయి.

ఈ వీడియోకు వార్నర్ తన భార్యతో కలిసి చాలాసార్లు టిక్‌టాక్ వీడియోలు చేశాడు. ఇటీవల ఐపీఎల్ సందర్భంగా తన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌తో కలిసి ఈ పాటకు వార్నర్ డ్యాన్స్ వేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిని బట్టి చూస్తే వార్నర్‌కు బుట్టబొమ్మ పాట ఎంత ఇష్టమనేది తెలిసిపోతుంది.